
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 13 న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రవాసాంధ్రులతో సమావేశం అవుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. సౌదీ అరేబియా లోని ప్రవాసాంధ్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు చంద్రబాబు.
మీరు సౌదీ అరేబియాలో ఉన్నప్పటికీ ఇక్కడ ఏపీలో ఉన్న మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలని చంద్రబాబు కోరారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ప్రవాసాంధ్రులు తోడ్పడ్డారని , ప్రజాస్వామ్య పునరుద్దరణ కోసం టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలో ఉన్న తెలుగువాళ్లు వడ్లమూడి సారధి నాయుడు , గౌరయ్య , కుమార్ , నగరం గోపి , గుణశేఖర్, చక్రపాణి, రమేష్ , చంద్రబాబు, ప్రసాద్, సురేష్ , మోహన్ , రాజు , సుమన్ , వేణు గోపాల్, రమణారెడ్డి , హేమాద్రి , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.