
కార్తీక మాసం పరమశివుడికి మరింత పరమానందభరితమైన మాసం కావడంతో ఆ కార్తీక మాసంలో పరమ శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తమ శక్తి కొలది పూజలు చేస్తుంటారు. తాజాగా” శివ పార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం ” JSW & Jaiswaraajya మరియు UBlood సంస్థల కార్పొరేట్ ఆఫీసులో సాయంత్రం జరుగనుంది.
17 వ తేదీ ఉదయం నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే రాత్రికి శివ పార్వతుల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగనుంది. ఈ పూజా కార్యక్రమాలను JSW & Jaiswaraajya మరియు UBlood సంస్థల అధిపతి జై యలమంచిలి , లావణ్య దంపతులు నిర్వహించనున్నారు. అలాగే సిబ్బంది కూడా పాల్గొననున్నారు.
