భారత మూలాలున్న బ్రిటన్ హోం శాఖా మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో బ్రిటన్ రాజకీయాలు మరింత రసవత్తరంగా తయారయ్యాయి. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికై 50 రోజులు కూడా కాకముందే బ్రిటన్ లో ఆర్ధిక సంక్షోభంతో పాటుగా రాజకీయ సంక్షోభం తలెత్తింది. బ్రిటన్ ఆర్ధిక మంత్రి తీసుకున్న నిర్ణయాలతో ఒక్కసారిగా మార్కెట్ కుప్పకూలింది. దాంతో ఆర్ధిక మంత్రి రాజీనామా చేశారు.
ఆ రాజీనామా చేసి వారం రోజులు కాలేదు అప్పుడే కీలకమైన మరో శాఖ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ కూడా రాజీనామా చేయడంతో లిజ్ ట్రస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. సుయెల్లా బ్రేవర్మన్ తల్లి తమిళనాడుకు చెందిన మహిళ కాగా తండ్రి గోవా కు చెందిన వారు కావడం విశేషం.