బ్రిటన్ హోం సెక్రటరీగా ఉన్న ప్రీతి పటేల్ రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో కొత్త హోం సెక్రటరీగా భారత సంతతికే చెందిన సుయెల్లా బ్రే వర్మన్ ను నియమించడం విశేషం. బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నిక కావడంతో భారత సంతతికి చెందిన ప్రీతి పటేల్ రాజీనామా చేసింది. ఆమె స్థానంలో మళ్ళీ భారత సంతతికి చెందిన సుయెల్లా కు అవకాశం కల్పించడం విశేషం.
సుయెల్లా ఇద్దరు పిల్లల తల్లి. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్ లోనే ఉంది సుయెల్లా బ్రే వర్మన్. ఇక మరో విశేషం ఏంటంటే సుయెల్లా తల్లి ఉమా హిందూ మతానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఇక తండ్రి క్రిస్టీ ఫెర్నాండేజ్ ఈయన గోవాకు చెందిన వ్యక్తి కావడం గమనార్హం. సుయెల్లా తల్లిదండ్రులది ప్రేమ వివాహం. భారత్ నుండి మారిషస్ కు అక్కడి నుండి యూకే కు వలస వెళ్ళింది సుయెల్లా తల్లి. ఇక తండ్రి కెన్యా నుండి వలస వచ్చాడు. మొత్తానికి భారత్ కు చెందిన పలువురు ప్రముఖులకు అగ్రరాజ్యం అమెరికాలోనే కాదు యూకే లో కూడా అగ్రతాంబూలం దక్కుతోంది.