ఇండో – పసిఫిక్ అభివృద్ధి కోసం భారత్ తో కలిసి పనిచేస్తామని మరోమారు స్పష్టం చేసింది అగ్రరాజ్యం అమెరికా. వైట్ హౌజ్ మీడియా కార్యదర్శి కరీన్ జాన్ పియర్ మీడియాతో మాట్లాడుతూ భారత్ తో చాలా కాలంగా ఇండో – పసిఫిక్ అభివృద్ధి కోసం , శాంతి కోసం పని చేస్తున్నామని , అయితే ఇప్పుడు మరింతగా మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నామని , భారత్ నమ్మదగిన దేశం కాబట్టి భవిష్యత్ లో రక్షణ , వాతావరణ , సాంకేతికత , వ్యాక్సిన్ తదితర రంగాలలో కలిసి పని చేయనున్నామని పునరుద్ఘాటించింది.
ప్రపంచం ముందు పలు సవాళ్లు ఎదురౌతున్నాయని , వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి భారత్ తో కలిసి పని చేస్తామని స్పష్టం చేసింది జాన్ పియర్. చైనా వల్ల ఇతర దేశాలకు ముప్పు పొంచి ఉందని , అందుకే ఇండో – పసిఫిక్ పై దృష్టి కేంద్రీకరించామన్నారు కరీన్ జాన్ పియర్ . చైనా వల్ల భారత్ కు కూడా ముప్పు పొంచి ఉంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అమెరికా ను లెక్కచేయడం లేదు దాంతో పెద్దన్న కు బాగానే కోపం వస్తోంది.