భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత పలువురు పోటీ పడగా అందులో లిజ్ ట్రస్ , రిషి సునాక్ ల మధ్యే జరిగింది. చివర్లో డేమోక్రాట్లు లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపడంతో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు.
అయితే ఆమె 45 రోజులు కూడా ప్రధాని పదవిని నిర్వహించలేకపోయింది. లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో తదుపరి ప్రధానిగా రిషి సునాక్ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. రిషి సునాక్ కు పెద్ద ఎత్తున ఎంపీల మద్దతు ఉంది. దాంతో భారత సంతతికి చెందిన మొట్టమొదటి వ్యక్తి బ్రిటన్ ప్రధాని అవ్వడం ఖాయమని భావిస్తున్నారు.