
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకావల్సి ఉండే…… అయితే ఆ విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టాడు. నాకు నిన్న మధ్యాహ్నం సీబీఐ నోటీసులు పంపింది. అయితే నాకు వరుసగా 5 రోజుల పాటు పలు కార్యక్రమాలు ఉన్నందున ఈరోజు సీబీఐ విచారణకు హాజరు కావడం లేదని అయిదు రోజుల తర్వాత వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళతానని మీడియా ముందు వెల్లడించాడు. అంతేకాదు ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకాలేను అంటూ మెయిల్ చేసాడు. ఇక బంతి సీబీఐ కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.