గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై హైదరాబాద్ నగరంలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి. దాంతో డబీర్ పురా లో కూడా రాజాసింగ్ పై కేసు నమోదు కావడంతో రంగంలోకి దిగిన డబీర్ పురా పోలీసులు రాజాసింగ్ ఇంటికి చేరుకొని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. తనని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా , చివరకు చంపినా సరే వెనక్కి తగ్గేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాముడిని కించపరిచిన వాళ్లకు పోలీసులు భద్రత కల్పించారు ……. దానికి కౌంటర్ గా మాట్లాడినందుకు నన్ను అరెస్ట్ చేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రాజాసింగ్.
Breaking News