ఈ నెల 23, 24 తేదీల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
రెండు రోజుల పాటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్న కమలం పార్టీ
కార్యవర్గ సమావేశాలకు బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్ హాజరుకానున్నారు.
బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జాయింట్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్ కూడా హాజరయ్యే అవకాశం.
మహబూబ్నగర్ జిల్లాలో రెండు రోజుల పాటు మాకం వేయనున్నరాష్ట్ర కార్యవర్గం.
కార్యవర్గ సమావేశం లో..
ఈ నెల 28న అమిత్ షా టూర్,
కార్నర్ మీటింగ్స్.
ప్రజా గోస- బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు.
కెసిఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.
పూర్తి స్థాయిలో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటు వంటి సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టనున్న రాష్ట్ర కార్యవర్గం