కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. డిసెంబర్ 19 న ఈడీ ముందు హాజరు కావాలని పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దాంతో డిసెంబర్19 న ఈడీ విచారణకు హాజరు అవుతానని స్పష్టం చేశాడు. ఇక ఈరోజు ఉదయం కూడా ఈడీ ఆఫీసుకు వెళుతున్నట్లుగా సమాచారం అందించాడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.
అయితే అనూహ్యంగా ప్లాన్ మార్చి ప్రగతి భవన్ సూచన మేరకు ఈడీ ఆఫీసుకు కాకుండా ప్రగతి భవన్ కు చేరుకున్నాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైన పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ కి లేఖ రాశాడు. ఆ లేఖ సారాంశం ఏంటంటే…… నాకు ఈనెల 25 వరకు గడువు ఇవ్వాలంటూ ….. అప్పటి వరకు నాకు వీలు కాదంటూ లేఖ పంపించాడు. మొత్తానికి ప్రగతి భవన్ రాజకీయ ఎత్తుగడ మేరకు నడుస్తోందన్న మాట.