
ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరు కానున్నాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. డిసెంబర్ 19 న ఈడీ ముందు హాజరు కావాలని నోటీసులు అందించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఏ కేసులో నోటీసులు ఇచ్చారో తెలపాలని తన లాయర్లతో ఈడీ ని వివరణ కోరగా అందుకు స్పందించిన ఈడీ ….. ఆస్తులు , బిజినెస్ , అలాగే కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలతో విచారణకు రావాలని కోరింది.
2015 నుండి ఐటీ వివరాలు అన్నీ ఇవ్వాలని కోరింది ఈడీ. దాంతో తనతో పాటుగా తన కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలతో ఈడీ ముందుకు హాజరు కానున్నాడు. అలాగే తన వెంట అడ్వకేట్ లను కూడా తీసుకెళ్లనున్నట్లు సమాచారం.