మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. 160 సిఆర్పీసీ కింద నాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేయకుండా సీబీఐ ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసాడు అవినాష్ రెడ్డి.
ఈనెల 10 న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు ఎంపీ. దస్తగిరి చెప్పే మాటలు సీబీఐ నమ్ముతోందని , నాపై ఎలాంటి నేరారోపణలు లేకున్నా …… ఆధారాలు లేకున్నా నన్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని , రేపటి విచారణను వాయిదా వేయాలని , ఒకవేళ విచారణ చేసినా అరెస్ట్ చేయకుండా చూడాలని కోర్టును కోరాడు.
ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ప్రధాన నిందితుడని భావిస్తోంది సీబీఐ. వివేకాను హత్య చేసిన తర్వాత సాక్ష్యాలను చెరిపేసింది అవినాష్ రెడ్డి అని , 50 కోట్ల డీల్ కుదిర్చాడని సంచలన ఆరోపణలు చేస్తోంది సీబీఐ. రేపటి విచారణ తర్వాత అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించాడు. మరి ఈ విషయం పై తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి.