30.2 C
India
Sunday, May 5, 2024
More

    Aadhi Pursh : ఆదిపురుష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్.. ఎలా ఉందంటే?

    Date:

    AadhiPursh Movie Review
    AadhiPursh Movie Review

    Aadhi Pursh :  అందరు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది.. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ మూవీ ఈ రాజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా అన్ని చోట్ల రిలీజ్ కాబోతుంది.. మరి ఆదిపురుష్ రివ్యూ ఎలా ఉంది? దీనికి ఎంత రేటింగ్ ఇచ్చారు? కథ పరంగా ఆడియెన్స్ ను మెప్పిస్తుందా? లేదా? అనే విషయాల గురించి తెలుసుకుందాం..

    ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ లో చారిత్రక సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
    అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించగా ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. టి సిరీస్ సంస్థ పై ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.. అయితే ఈ సినిమా టీజర్ వచ్చినప్పుడే దారుణమైన ట్రోలింగ్స్ కు గురి అయ్యింది..
    నెగిటివ్ కామెంట్స్ భారీగా రావడంతో ఈ సినిమా వాయిదా వేసి విఎఫ్ఎక్స్ వర్క్స్ పై మేకర్స్ ద్రుష్టి పెట్టారు. ఆ తర్వాత ట్రైలర్, సాంగ్స్ ఇలా ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి నెగిటివ్ కామెంట్స్ నుండి పాజిటివ్ కామెంట్స్ తెచ్చుకుని భారీ హోప్స్ కూడా పెంచేసుకున్నాడు.
    నటీనటులు : 
    ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవ్ దత్త నాగే తదితరులు.. 
    డైరెక్షన్ : ఓం రౌత్ 
    సంగీతం : సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
    బ్యానర్ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 
    కథ : 
    దశరథ మహారాజు ( ప్రభాస్) వృద్ధాప్యంలో రాజ్యపాలన నుండి విముక్తుడై తన పెద్ద కొడుకు రాఘవ్ ( ప్రభాస్)ను అయోధ్య మహానగరంకు రాజుని చెయ్యాలని అనుకుంటారు.. కానీ మహారాజు రెండవ భార్య కైకేయి మాత్రం రాఘవుడికి బదులుగా తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలనీ అలాగే రాముడికి 14 ఏళ్ల వనవాసం విధించాలని కోరుతుంది..
    రాముడు దశరథుడి ఆజ్ఞ ప్రకారం భార్య జానకి (కృతి సనన్) ను లక్ష్మణుడితో కలిసి వనవాసం వెళ్ళినప్పుడు సూర్పనక్క లక్ష్మణుడిని వరిస్తుంది.. అందుకు లక్ష్మణుడు ఇష్టం లేదని చెప్పడంతో పగ పెంచుకుని రాక్షస సైన్యంతో దాడులు చేస్తుంది. సీత దేవికి గాయాలు అవ్వడంతో లక్ష్మణుడు ఆగ్రహించు సూర్పనక్క ముక్కు కోసేస్తాడు.. ఆ తర్వాత ఈమె తన అన్నయ్య రావణుడు ( సైఫ్ అలీ ఖాన్ ) కు చెప్పింది.
    ఆయన సీత దేవిని అపహరిస్తాడు. అశోకవనంలో బంధించిన రావణాసురుడును జయించి ఆయనతో యుద్ధం చేసి సీతా దేవిని ఎలా తీసుకు వచ్చాడు? అందుకు వానరసైన్యం చేసిన సహాయం ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాడు.
    విశ్లేషణ :
    ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా ఉంది.. సినిమా మొత్తం గ్రాండ్ గా అద్భుతంగా తెరకెక్కించారు.. విజువల్స్ గ్రాండ్ గా చక్కగా తీసాడు.. రామ్ సీతా రామ్ పాట, సీతను రావణుడు అపహరించే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే విఎఫ్ఎక్స్ సన్నివేశాలు మాత్రం నాసిరకంగా ఉన్నాయనే చెప్పాలి.. రామాయణం అందరికి తెలిసిన కథనే.. మరి అలాంటి తెలిసిన కథనే మళ్ళీ చూడాలంటే విజువల్స్ అద్భుతంగా ఉండాలి.. కానీ కొన్ని సన్నివేశాల్లోనే అది బాగుంది.. ప్రభాస్ లుక్స్ బాలేక పోయిన నటనతో మెప్పించాడు.. అయితే ఈయన డబ్బింగ్ కూడా బాగా చెప్పలేదు అనిపించింది.. కొన్ని క్లోజప్ షాట్స్ లో ఆయన లుక్స్ వరస్ట్ గా ఉంటుంది.. ఇక సినిమాకు ఆయువు పట్టు అంటే అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి.
    చివరి మాట..
    విఎఫ్ఎక్స్ మీద అంచనాలతో వెళితే మిమ్మల్ని ఈ సినిమా మెప్పించక పోవచ్చు.. మాములుగా టేకింగ్ పరంగా అయితే అందరిని ఆకట్టు కుంటుంది.. మరి ఈ సినిమా వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి..
    రేటింగ్ : 2.75 / 5

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Adi Purush : ‘ఆది పురుష్’ రావణుడి తలలు అక్కడి నుంచే.. ఆధారం చూపుతున్న మూవీ టీమ్

    Adi Purush : ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్...

    Adhi Pursh : ప్రభాస్ పై అభిమానంతో చేయి కోసుకున్న అభిమాని

    Adhi Pursh : ఆదిపురుష్ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో...

    ఆదిపురుష్ పై విమర్శలు చేయడం తగదు.. హరీష్ శంకర్

    ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విడుదలకు ముందే వివాదాలకు కేంద్రంగా...

    RRR VS AdhiPursh : ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన ఆదిపురుష్.. రికార్డులు బద్ధలే!

    RRR VS AdhiPursh  : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అసిపురుష్ మ్యానియా...