Adi Purush : ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తీసిన సినిమా ‘ఆది పురుష్’. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ సంపాదించుకున్నా.. ప్రభాస్ ఇమేజ్ తో రికార్డులు దక్కించుకుంది. రామాయణం ఇతిహాసం నుంచి కథను తీసుకున్న ఓం రౌతు నెగెటివ్ టాక్ రావడంతోనే కాదని బుకాయించే ప్రయత్నం చేసినా దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇందులో చాలా మిస్టేక్స్ ను చూపించారు సనాతన వాదులు.
సినిమా ప్రారంభం నుంచే ఇది అందులోని మిస్టేక్స్ చూపుతూ రామాయణాన్ని అపహాస్యం చేశాడని దుమ్మెత్తి పోశారు. హనుమంతుడికి పిల్లిగడ్డం, రాముడికి మీసాలు, రావణాసురుడికి విరాట్ కోహ్టీ కటింగ్ ఇలా ప్రతీది వెతికి మరీ నిలదీయం మొదలు పెట్టారు భక్తులు. ఇక పెద్ద వారు అయితే.. ఏదో రాముడి సినిమా అని పోతే ఇదేంటండీ అంటూ పెదవి విరిచారు.
ఇవన్నీ పక్కన ఉంచితే రావణాసురుడి 10 తలల గురించి తెలుసుకుందాం. సాధారణంగా దశ కంఠుడు అంటే పది తలలు పక్క పక్కన ఉండాలి. కానీ ఓం రౌత్ మాత్రం కింద ఐదు పైన ఐదు చూపించాడు. ఇదేంటి ఇలా చూపావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనికి గల ఆధారాన్ని ఇటీవల కనుగొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సంస్కృతిక నిర్మాణం అయిన అంకుర్ వాట్ గోడలపై రావణాసురుడి పది తలలు త్రిభుజాకారంలో ఉంటాయి. ఇందులో కింద, పైన దశకంఠుడి కంఠాలను చెక్కారు శిల్పులు. దీన్నే బేస్ చేసుకొని ఆది పురుష్ తో రావణాసురుడిని చూపించారంటూ వాదనలు వినిపిస్తున్నాయి.
500 కోట్లు పెట్టి సినిమా తీసిన ఓం రౌతుకు తెలియదా ఈ విషయం అంటే ఇప్పుడు సనాతన వాదులు సైతం నోటిపై వేలువేసుకుంటున్నారు. తొందరపడ్డామా? అని తమకు తాము ప్రశ్నించుకుంటున్నారు. ‘దశ కంఠుడి పది తలలు చూపించారు గానీ ఇక్కడే ఉండాలన్న రూల్ అయితే లేదని వీటిని చూస్తే అర్థం అవుతుందని’ కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా అంకుర్ వాట్ టెంపుల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది.
View this post on Instagram