ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త సిద్దార్థ్ రాయ్ కనీసం ఐదేళ్ల పాటు కూడా కాపురం చేయకుండానే చనిపోవడంతో తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యిందట ఒకప్పటి హీరోయిన్ శాంతి ప్రియ. భర్త మరణం కలిచివేయడంతో రెండేళ్ల పాటు ఇంట్లో నుండి బయటకు రాలేక పోయింది. రెండేళ్ల తర్వాత అక్క భానుప్రియ వచ్చి ముంబయి లో ఒంటరిగా ఎలా ఉంటావ్ …… మద్రాస్ వచ్చేయమని కోరిందట. కానీ శాంతి ప్రియ మాత్రం అందుకు నిరాకరించి ముంబై లోనే ఉండిపోయింది.
తాజాగా ధారావి బ్యాంక్ అనే చిత్రంలో నటించింది శాంతి ప్రియ. ధారావి బ్యాంక్ తో నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానని , ఇప్పుడు OTT వల్ల మంచి మంచి కథలు వస్తున్నాయని , అవకాశాలు కూడా వస్తున్నాయని దాంతో నటిగా నన్ను నేను నిరూపించుకునే వెసులుబాటు కలిగిందని అంటోంది శాంతి ప్రియ.
90 వ దశకంలో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన శాంతి ప్రియ తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగులో మహర్షి అనే చిత్రంలో నటించి చాలా మంచి పేరు తెచ్చుకుంది. నాగార్జున , రాజశేఖర్ తదితర హీరోల సరసన నటించిన శాంతి ప్రియ కు వెంకటేష్ సరసన నటించే అవకాశం దక్కలేదని బాధ పడుతోంది. ఓటీటీ పుణ్యమా అని మళ్ళీ బిజీ అవుతానని అంటోంది శాంతి ప్రియ.