Hebah Patel సినీ రంగంలో హీరోయిన్లతో హీరోలు ప్రేమలో పడడం మనం చూస్తూనే ఉన్నాం.. డేటింగ్ పేరుతో టైం పాస్ చేస్తుంటారు.. ఇప్పటికే చాలా మంది ఇలా డేటింగ్, లవ్ ఎఫైర్ అంటూ వార్తల్లో నిలైహ్సిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. కానీ వీరిలో కొంతమంది మాత్రమే పెళ్లి వరకు వెళ్తుంటారు.. కొందరు లవ్ తోనే రిలేషన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు.
ఈ క్రమంలోనే హీరోయిన్స్ ఇంతకు ముందులా కాకుండా దైర్యంగా తమ రిలేషన్ విషయాలను బయట పెడుతున్నారు.. వారు ఈ విషయాలపై మీడియా ముందు రివీల్ చేసి సంచలనం సృష్టిస్తున్నారు.. తాజాగా యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..
గతంలో రాజ్ తరుణ్ తో ఎక్కువ సినిమాల్లో నటించింది.. స్క్రీన్ మీద కూడా వీరి కెమిస్ట్రీ బాగా అలరించేది.. దీంతో ఈ జంట మధ్య కుచ్ కుచ్ హోతా హై అనే కామెంట్స్ వచ్చాయి.. వీరిద్దరూ బయట కూడా కనిపించే వారు.. దీంతో నిజంగానే ఈ జంట లవ్ లో ఉన్నారనే రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యేవి..
ఈ కామెంట్స్ చాలా రోజులు ఇద్దరు స్పందించలేదు.. కానీ ఒకానొక సమయంలో ఈమె ఈ న్యూస్ విషయంలో స్పందిస్తూ.. నేను కూడా రాజ్ తరుణ్ తో వస్తున్న రూమర్స్ గురించి విన్నానని.. నాకు అవి తెలుసు.. కాకపోతే పెద్దగా మేము సీరియస్ గా తీసుకోలేదు.. మా మధ్య రిలేషన్ ఉందని రాయడం చాలా ఫన్నీగా అనిపించింది.. మీరు ఏమైనా రాసుకోండి.. నో ప్రాబ్లెమ్ అంటూ ఈమె చెప్పుకొచ్చింది..