
స్టార్ హీరోయిన్ నయనతార అభిమానులకు షాక్ ఇచ్చింది. ఒకేసారి ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో షాక్ అవుతున్నారు అభిమానులు అలాగే చిత్ర పరిశ్రమ. అదేంటి పెళ్లి చేసుకొని 5 నెలలు కూడా కాలేదు అప్పుడే తల్లి కావడం ఏంటి ? అయినా గర్భం దాల్చిన దాఖలాలు లేవు……. అలాంటిది కవల పిల్లలకు జన్మనివ్వడం ఏంటి ? అని షాక్ అవుతున్నారా ?
అసలు విషయం ఏమిటంటే……. నయనతార – విఘ్నేష్ శివన్ లు తల్లిదండ్రులు అయ్యారు కాకపోతే నయనతార గర్భం దాల్చి పిల్లలను కనలేదు…….. సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారు అదన్న మాట అసలు విషయం.
ఆరు సంవత్సరాలుగా నయనతార – విఘ్నేష్ శివన్ లు ప్రేమించుకున్నారు. సహజీవనం చేశారు. కట్ చేస్తే అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకునే ముందు జనవరిలో ఒక అంగీకారానికి వచ్చి సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనివ్వాలని అనుకొని అందుకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత జూన్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక నిన్న ఇద్దరు మగ పిల్లలు తమ వారసులుగా రావడంతో చాలా సంతోషంగా ఉంది నయనతార. తన ఇద్దరు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వదిలి సంచలనం సృష్టించింది నయనతార.