ramyakrisha రమ్యకృష్ణ, సౌందర్య, మీనా, నగ్మా వీరంతా సమకాలీన హీరోయిన్లు. ఎవరికి వారే సాటి. ఇందులో బాగా ఫేమస్ అయిన వారు సౌందర్య, మీణా, రమ్యకృష్ణ. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచే సినీ ఇండస్ట్రీలో ఉండగా రమ్యకృష్ణ, సౌందర్య మాత్రం వచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇక ఆ సమయంలో 10 సినిమాలు రిలీజ్ అయితే అందులో 7 నుంచి 8 సినిమాలు రమ్యకృష్ణ లేదా సౌందర్య హీరోయిన్లుగా నటించినవే. అందం, అభినయంతో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు.
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నర్సింహ’ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ కలిసి పని చేశారు. రజనీకాంత్ హీరో కాగా ఆయన కెరీర్ లో మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇందులో సౌందర్య హీరోయిన్ గా నటిస్తే నెగెటివ్ రోల్ లో రమ్యకృష్ణ నటించింది. అయితే నర్సింహ సినిమా సౌందర్య కంటే రమ్యకృష్ణకే ఎక్కువ గుర్తింపు సంపాదించి పెట్టింది. నెగెటివ్ పాత్రలో డైనమిక్ లేడీగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ విషయంలో తీవ్ర ఆలోచనలో పడ్డారు డైరెక్టర్. కథ ప్రకారం హీరోయిన్ మొహంపై నెగెటివ్ క్యారెక్టర్ లో వారు కాలు పెట్టాలి. ఈ సీన్ విషయంలో చాలా రూమర్లు వచ్చాయి.
వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు కేఎస్ రవికుమార్. గతంలో ఒక ఇంటర్వ్యూలో అసలు ఈ సీన్ వెనుక జరిగిన విషయం చెప్పుకచ్చాడు. ‘ఈ సినిమాలో నీలాంబరి పాత్ర కోసం నగ్మాను తీసుకోవాలనుకున్నాం అది కుదరలేదు, తర్వాత మీనాను అనుకున్నాం. కానీ చివరగా రమ్యకృష్ణను ఫైనల్ చేశాం. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పటి నుంచి రమ్యకృష్ణ నాకు తెలుసు. ఇక నర్సింహ సినిమాలో సౌందర్య మొహంపై కాలు పెట్టే సీన్ చెప్పినప్పుడు ఆ సీన్ చెయ్యనని చెప్పింది.
ఆ సినిమా సమయంలో రమ్యకృష్ణ కంటే సౌందర్య మార్కెట్ ఎక్కువ. నా మార్కెట్ తక్కువ అని రమ్యకృష్ణ చెప్పింది. కానీ సౌందర్య మాత్రం నువ్వు చెయ్యాలి అని చెప్పింది. ఆమెనే రమ్యకృష్ణ కాలును తన మొహపై పెట్టుకుంది. ఆ సమయంలో రమ్యకృష్ణ ఏడ్చింది. అయితే ఆ షాక్ డూప్ అంటూ పుకార్లు వచ్చాయి. కానీ అది నిజం.’ అని చెప్పారు దర్శకుడు కేఎస్ రవికుమార్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీ.