Jailor : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా జైలర్. సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కూడా నటించారు. సినిమా గురువారం విడుదల కానుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత చిత్రాలు పరాజయం చవిచూడటంతో ఈ సినిమాపై తలైవా ఆశలు పెంచుకున్నారు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 10న సినిమా విడుదల చేయనున్నారు.
సినిమాకు యు సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా 2 గంటల 49 నిమిషాల నిడివి ఉంటుంది. దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. రజనీకాంత్ లుక్స్, స్టైల్, డైలాగ్స్ కొత్తగా ఉంటాయి. రజనీ మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీ అని చెబుతున్నారు. 2021లో వచ్చిన హాలీవుడ్ మూవీ నో బడీ సినిమాకు కాపీ అని అంటున్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో భాగంగా తెలంగాణలో రూ. 4.50 కోట్లు, రాయలసీమలో రూ. 2.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో రూ. 5 కోట్లు, ఓవరాల్ గా రూ. 12 కోట్లు బిజినెస్ రాబట్టింది. తమిళనాడులో రూ.62 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లు, కర్ణాటకలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 5.50 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 122.50 కోట్లు షేర్ చేసింది.
సినిమాకు అనురుధ్ సంగీతం అందించాడు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ఫ్రాష్, నాగేంద్రబాబు, రమ్యక్రిష్ట, సునీల్, వసంత్ రవి, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై మారన్ గ్రాండ్ లెవల్లో నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా విడుదల చేస్తున్నారు. రజనీ కాంత్ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో రజనీ పేరు మోయిదీన్ గా పెట్టారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చేస్తున్నారు.