
చాలా రోజుల తర్వాత JSW & Jaiswaraajya కు ఇచ్చిన ఇంటర్వ్యూని లక్షలాది మంది చూడటంతో సంతోషాన్ని వ్యక్తం చేసారు సీనియర్ నటులు చంద్రమోహన్. తెలుగునాట తిరుగులేని నటులుగా చెరగని ముద్ర వేశారు చంద్రమోహన్. హీరోగా , కమెడియన్ గా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఏ కోణంలో చూసినా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించిన నటులు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయి ఖ్యాతిని సముపార్జించిన చంద్రమోహన్ ప్రస్తుతం నటనకు కాస్త దూరంగా ఉన్నారు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూకు అద్భుత స్పందన రావడంతో మరోసారి JSW & Jaiswaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు చంద్రమోహన్. ఆ ఇంటర్వ్యూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. చంద్రమోహన్ హీరోగా నటించిన పలు చిత్రాలకు ఎస్పీ బాలు పాటలు పాడారు. ఆ పాటలన్నీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని టపాసులు కాల్చే సమయంలో పిల్లలు , పెద్దలు అందరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.