
హాట్ భామ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన భర్త భరద్వాజ్ తో కలిసి ఫోటోకు ఫోజిచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడమే ఈ గొడవకు కారణం అయ్యింది. తన భర్తను పొగుడుతూ ఓ క్యాప్షన్ ఇచ్చింది. అంతే కొంతమంది నెటిజన్లకు అది నచ్చలేదు దాంతో ఘోరమైన కామెంట్స్ చేశారు. అనసూయ ను అలాగే ఆమె భర్తని చులకన చేసి మాట్లాడటంతో అనసూయకు విపరీతమైన కోపం వచ్చింది.
అంతే …… తనని , తన భర్తను అవమానించిన నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళ కు అదే భాషలో కౌంటర్ ఇచ్చింది అనసూయ. అయితే కౌంటర్ కు కౌంటర్ ఇస్తూ పోవడంతో వివాదం మరింత పెద్దదైంది. వివాదం ఎంత పెద్దదైనా సరే అనసూయ మాత్రం ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించింది. గతంలో కూడా తనని అకారణంగా దూషించిన వాళ్లపై ఏకంగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ గొడవ సంగతి పక్కన పెడితే…….. జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చిన అనసూయ హాట్ యాంకర్ గా తనదైన ముద్ర వేసింది. కొన్నాళ్ల పాటు అనసూయ అందాల కోసమే…… కొంతమంది కుర్రాళ్ళు , ముసలి వాళ్ళు జబర్దస్త్ చూశారంటే అతిశయోక్తి కాదు సుమా!. అంతగా ప్రభావం చూపించింది…… అందాలతో మతిపోగొట్టేసింది అనసూయ. తాజాగా సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది.
View this post on Instagram