డార్లింగ్ ప్రభాస్ జాతకం 2023 నుండి ఘోరంగా ఉండబోతోందని బాంబ్ పేల్చాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. సెలబ్రిటీల జాతకాలు చూసి చెప్పే ఈ స్వామి ఇప్పటికే పలు విషయాలు చెప్పగా అందులో కొన్ని నిజమయ్యాయి. దాంతో యితడు చెప్పే విషయాలు ఇక సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ప్రభాస్ గురించి మరోసారి చెప్పి సంచలనం సృష్టించాడు.
2023 నుండి ప్రభాస్ జాతకం ఘోరంగా ఉండబోతోందని , ప్రభాస్ కు మాత్రమే కాకుండా ప్రభాస్ చుట్టూ ఉన్న వాళ్లకు కూడా ఘోరమైన కష్టాలు రాబోతున్నాయని , అతడి వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బందులు పడటం ఖాయమని , ప్రభాస్ జాతకాలు పెద్దగా నమ్మడని , అందుకే ఇన్ని కష్టాలు రాబోతున్నాయంటూ బాంబ్ పేల్చాడు.
జాతక ప్రభావ రీత్యా కొన్ని రెమెడీస్ ఉంటాయని , అవి చేస్తే కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉందని , అయితే ప్రభాస్ మాత్రం జాతకాలు పెద్దగా నమ్మడని , కానీ జాతకాలు నమ్మని ప్రభాస్ జాతకాలు చెప్పే సినిమా రాధేశ్యామ్ చేసాడని , అందుకే ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యిందని పేర్కొన్నాడు. వేణు స్వామి చెప్పే విషయాలు ప్రభాస్ అభిమానులను తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యేలా చేస్తున్నాయి. దాంతో కొంతమంది డార్లింగ్ అభిమానులు ఇతగాడికి వార్నింగ్ లు ఇచ్చారట.