
నందమూరి కుటుంబాన్ని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువమంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే ఇతర కారణాలతో కూడా నందమూరి కుటుంబ సభ్యులు మరణించడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. ఆ తర్వాత త్రివిక్రమరావు కుమారుడు హరేన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
అలాగే కళ్యాణ్ చక్రవర్తి తనయుడు పృథ్వీ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అలాగే 2009 లో జూనియర్ ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుండి ఎన్టీఆర్ బయటపడ్డాడు. 2014 లో నందమూరి హరికృష్ణ తనయుడు నందమూరి జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
అలాగే 2018 లో నందమూరి హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. ఓ పెళ్లి కి హాజరు కావడానికి వెళ్తున్న హరికృష్ణ కారు ప్రమాదంలో మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖసాగరంలో ముంచింది. ఇక గత ఏడాది ఎన్టీఆర్ చిన్న కూతురు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇప్పుడేమో నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. దాంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నందమూరి కుటుంబంలో రోడ్డు ప్రమాదాలు , అనుకోని అవాంతరాలతో మరణాలు సంభవిస్తున్నాయి దాంతో నందమూరి అభిమానులు ఈ సంఘటనలు తలుచుకుంటూ రోదిస్తున్నారు.