నందమూరి తారకరత్నకు నివాళులు అర్పించారు ఎన్టీఆర్ , నందమూరి కళ్యాణ్ రామ్ లు. నిన్న రాత్రి బెంగుళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. దాంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి బెంగుళూర్ నుండి తారకరత్న భౌతిక కాయాన్ని హైదరాబాద్, మోకిలలోని తారకరత్న ఇంటికి తరలించారు.
ఇక ఈరోజు ఉదయం ఎన్టీఆర్ , నందమూరి కళ్యాణ్ రామ్ లతో పాటుగా నందమూరి కుటుంబ సభ్యులు తారకరత్నకు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కలిసి వచ్చి తారకరత్నకు నివాళులు అర్పించారు. ఇక ఇదే సమయంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా వచ్చారు. తారకరత్నకు నివాళి అర్పించిన తర్వాత ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లతో ముచ్చటించాడు.