ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణించిన 22 రోజుల తర్వాత భార్య జయలక్ష్మి కూడా మరణించింది. దాంతో విశ్వనాథ్ కుటుంబంలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. 86 సంవత్సరాల జయలక్ష్మి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భర్త మరణించిన తర్వాత భార్య కూడా మరణించడంతో భార్యాభర్తల అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ఫిబ్రవరి 2 న దర్శకులు కె. విశ్వనాథ్ మరణించగా ఫిబ్రవరి 26 ఆదివారం రోజున గుండెపోటుతో మరణించింది జయలక్ష్మి.
Breaking News