చంద్రముఖి 2 షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ ఇది. చంద్రముఖి బ్లాక్ బస్టర్ కావడానికి రెండే రెండు కారణాలు……. ఒకటి రజని మేనియా ….. రెండు జ్యోతిక అద్భుతమైన నటన . అయితే ఈ రెండో పార్ట్ లో జ్యోతిక నటించడం లేదు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నటించడం లేదు.
రజనీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తుండగా జ్యోతిక పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ ఇద్దరు కూడా నటనలో దిట్ట అందులో ఎలాంటి అనుమానం లేదు. కాకపోతే అప్పటి మ్యాజిక్ ని రిపీట్ చేయగల సత్తా ఈ ఇద్దరికి ఉందా ? అన్నదే అసలు సిసలైన ప్రశ్న. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలి కపిల్ హౌజ్ లో చంద్రముఖి 2 షూటింగ్ జరుగుతోంది. కంగనా రనౌత్ , లారెన్స్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.