31.3 C
India
Saturday, April 27, 2024
More

    Chandramukhi-2 Collections : చంద్రముఖి-2 కలెక్షన్స్ వివరాలు.. బాక్సాఫీస్ వద్ద ఊగిసలాట.. అన్ని కోట్ల నష్టాలు ఖాయమా?

    Date:

    Chandramukhi 2 Collection Details
    Chandramukhi 2 Collection Details

    Chandramukhi-2 Collections :

    మొన్న వీకెండ్ కు బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల్లో చంద్రముఖి 2 ఒకటి.. చంద్రముఖి సినిమా పార్ట్ 1 ను ఇప్పటికి ఎవరు మర్చిపోలేదు.. దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా కూడా ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ తగ్గలేదు.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన చంద్రముఖి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది అనే చెప్పాలి..

    2005లో రిలీజ్ అయిన ఈ సినిమాను పి వాసు డైరెక్ట్ చేయగా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈ సినిమా వచ్చిన 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ తెరకెక్కింది. రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించగా.. లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.. మరి ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

    దాదాపు 50 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2000 స్క్రీన్ లకు పైగానే విడుదల అయ్యింది. రిలీజ్ రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా చంద్రముఖి సినిమాలో ఉన్నంత కంటెంట్ లేదు అనే అభిప్రాయం ప్రేక్షకుల మదిలో ఉంది.. లాంగ్ వీకెండ్ లో కాస్త కలెక్షన్స్ రాబట్టింది కానీ వీక్ డేస్ లో మొత్తం డల్ అయ్యిందని తెలుస్తుంది.

    మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందంటే.. ఇప్పటి వరకు 6 రోజుల్లో ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో మొత్తం 31 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో 46 కోట్లకు పైగానే రాబట్టింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినిష్ చేయాలంటే కనీసం 40 కోట్ల షేర్, 80 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది అని టాక్.. ఇప్పటి వరకు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ మూవీ రానున్న రోజుల్లో ఎంత రాబట్టిందో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన...

    Prabhas Records : రికార్డుల మోత మోగిస్తున్న ప్రభాస్.. ఏఏ సినిమా ఎంత ఎంత వసూలు చేస్తుందంటే?

    Prabhas Records : సలార్: సీజ్ ఫైర్ : ప్రభాస్ నటించిన...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...