35.8 C
India
Sunday, April 28, 2024
More

    Suriya Jyothika : పిల్లలతో కలిసి ముంబైకి జ్యోతిక షిఫ్ట్.. సూర్య ఇంట్లో ఏం జరుగుతోంది..?

    Date:

    Suriya Jyothika
    Suriya wife Jyothika shifted to mumbai

    Suriya Jyothika : సెలబ్రిటీలు అనగానే ఏదో ఒక రూమర్, గాసిప్ పుట్టుకొస్తోంది. సినిమావాళ్ల గురించి ఏదీ రాసినా జనాలు ఇంట్రెస్టింగ్ గా చదువుతారు. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి వారికి భలే ఆసక్తి ఉంటుంది. ఈ కారణంతో కొన్ని నిజాలు, కొన్ని కల్పితాలు రాసేస్తూ ఉంటారు. అయితే కొన్ని మొదట రూమర్ గా స్టార్ట్ అయ్యి.. ఆ తర్వాత నిజాలుగా మారినవి కూడా ఉంటాయి. కొన్ని రూమర్లు మధ్యలోనే సమసిపోతాయి.

    ఇక సెలబ్రిటీల వివాహబంధం గురించైతే మాత్రం వార్తలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. చిరంజీవి చిన్న కుమార్తె, నాగబాబు గారాలపట్టి, నాగార్జున కొడుకు, రజనీకాంత్ బిడ్డ.. ఇలా ఏ ఒక్కరూ రూమర్స్ కు అతీతులు కాదు. వీరి వివాహబంధాలన్నీ వార్తల్లో నిలిచినవే. కొందరు పెళ్లి చేసుకున్నాక ఏదో ఒక కారణంతో తొందర్లోనే విడాకులు తీసుకుంటారు. మరికొందరు కాపురం చేశాక 35ఏండ్లకు కూడా విడాకులు తీసుకున్నవారు ఉన్నారు. ఇలా సినిమా వాళ్ల బంధాలకు ఎప్పుడూ ‘బ్రేకప్’ పడుతుందో ఎవరికీ తెలియదు.

    సూర్య-జ్యోతిక. వీరిది అందమైన జంట. సౌత్ సినీ సెలబ్రిటీల్లో వీరి జంటకు ప్రత్యేక స్థానముంది.  తమ నటనతో వీళ్లు లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జ్యోతిక కెరీర్ టాప్ లో ఉన్నప్పుడే సూర్యను 2006లో పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.  ఇక పెళ్లయిన తర్వాత జ్యోతిక సినిమాల్లో నటించింది. దానికి సూర్య ఏనాడూ వద్దని చెప్పలేదు. జ్యోతిక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీలు చేస్తూ అడపాదడపా జనాలను అలరిస్తూనే ఉంది. ఇక సూర్య ఫుల్ బిజీ యాక్టర్. మొన్నటిదాక వీరిది అన్యోన్య దాంపత్యం అనుకున్నారు అంతా..

    సడెన్ గా జ్యోతిక ఇద్దరు పిల్లలను తీసుకుని చెన్నై నుంచి ముంబైకి షిఫ్ట్ అయినట్టు వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఆమె అత్తిల్లు వదిలేసి ముంబైకి తల్లిదండ్రుల దగ్గరకు ఎందుకు వెళ్లింది..? అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమె పిల్లలను కూడా అక్కడి స్కూల్ చేర్పించనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రెండు విషయాలు నిజాలే అని తెలుస్తోంది. మరి సూర్య-జ్యోతిక విడాకులు తీసుకున్నారు  కావొచ్చు అందుకే ముంబైకి షిఫ్ట్ అయ్యింది అని కొందరంటున్నారు. మరి వారిద్దరి మధ్య ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. జ్యోతిక మాత్రం తమ బంధంపై వచ్చే వార్తలన్నీ రూమర్సే అని కొట్టిపారేసింది.

    తానూ ముంబై నుంచి తన తల్లిదండ్రుల నుంచి 27సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నానని, వారి వృద్ధాప్యంలో వారికి తోడుగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని చెపుతోంది. అయితే మరీ సూర్య ఒంటరిగా ఉంటాడు కదా.. మీ పేరెంట్స్ నే చెన్నైకి తీసుకొచ్చి అంతా కలిసే ఉండొచ్చు కదా అనే ప్రశ్నకు జ్యోతిక.. తన అత్తింట్లో తన పేరెంట్స్ ఎలా ఉండగలరని సమాధానం చెప్తోంది. ఇలాంటి రూమర్స్ కు ఆన్సర్ ఇవ్వకుండా సూర్య సైలంట్ గా ఉన్నాడు.. చూడాలి మరి ఇందులో ఎంతవరకు వాస్తవముందో.. సినీ సెలబ్రిటీలపై వచ్చిన వార్తలు మొదట్లో రూమర్స్ గానే బయటకు వచ్చినా.. కొన్ని రోజుల తర్వాత అవే నిజమవుతాయి. మరి జ్యోతిక-సూర్య ఇష్యూలో అలాంటిది జరగవద్దని వారి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Suriya : సూర్యతో విడాకులు? జ్యోతిక నుంచి ఊహించని ట్విస్ట్.. అసలేం జరిగింది?

    Suriya : సంవత్సరాలకు సంవత్సరాలు ప్రేమించుకోవడం లేదంటే లివ్ ఇన్ రిలేషన్...

    Starmaa : ‘సిగ్గుండాలి..’ అంటూ భార్యను స్టేజీపైనే తిట్టిన కొరియోగ్రాఫర్

    Starmaa : ‘స్టార్ మా’ లో కొన్ని వారాల నుంచి వినూత్నమైన...

    సంచలనం సృష్టిస్తున్న సూర్య 42 టైటిల్ కంగువ

    తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా నటిస్తున్న 42 వ చిత్రానికి...

    సూర్య 42 కి భారీ సన్నాహాలు

    తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం '' సూర్య...