36.9 C
India
Tuesday, April 21, 2026
More

    చిరంజీవికి డైరెక్టర్స్ కావలెను

    Date:

    Chiranjeevi wants directors
    Chiranjeevi wants directors

    భోళా శంకర్‌ తర్వాత చిరంజీవి సినిమాపై క్లారిటీ రాకపోయినా.. నిన్నటి వరకు చేతినిండా దర్శకులున్నారు. ఎవరో ఒకరు కథతో మెప్పించి ఛాన్స్‌ కొట్టేస్తారనుకుంటే.. ఒక్కొక్కరూ వెళ్లిపోతున్నారు. ధమాకా హిట్‌ తర్వాత దర్శకుడు త్రినాథరావు చిరంజీవికి కథ రాస్తున్నాడనుకుంటే.. నాగశౌర్యతో సినిమా కమిటయ్యాడు. చిరంజీవి వెంకీ కుడుముల కాంబినేషన్ కూడా వర్కవుట్ కాలేదు. దర్శకుడు చెప్పిన కథ నచ్చకపోవడంతో.. ఎనౌన్స్‌మెంట్‌ చేసిన ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అయింది. నితిన్‌, రష్మికతో భీష్మ తీసిన వెంకీ.. మరోసారి ఇదే జంటను రిపీట్ చేస్తూ.. రీసెంట్‌గా సినిమా మొదలుపెట్టాడు.

    చిరంజీవి చేతిలో నుంచి దర్శకులు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మెగాస్టార్‌కు సరిపోయే కథలు రాయలేకపోతున్నారా? ఏడాదిపాటు కథతోనే ట్రావెల్‌ చేసి టైం వేస్ట్‌ చేసుకోవడం ఎందుకనుకుంటున్నారోగానీ.. పూరీజగన్నాథ్‌ కూడా రామ్‌ కోసం కథ రాసుకునే పనిలో వున్నాడట. ప్రస్తుతానికి మెగా కాంపౌండ్‌లో బంగార్రాజు ఫేం కల్యాణ్‌ కృష్ణ ఒక్కటే వున్నాడు. ఇతనితోపాటు.. బింబిసార దర్శకుడు వశిష్ట చేరాడు. బింబిసార హిట్‌ తర్వాత సీక్వెల్‌ కథను రెడీ చేయాలనుకున్నాడు దర్శకుడు. బింబిసారను మించిన కథ కుదరకపోవడంతో పక్కన పెట్టేశాడు . స్టార్స్‌కు కథలు రాయడం మొదలుపెట్టాడు. రజనీకాంత్‌ను కలిసి కథ వినిపించాడని.. చిరంజీవి, బాలకృష్ణ కోసం కథలు రెడీ చేస్తున్నాడన్న వార్తలు బైటకొచ్చాయి. అయితే.. కొన్ని రోజులుగా చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి.. అంజి లాంటి సోషియో ఫాంటసి స్టోరీ ప్రిపేర్‌ చేస్తున్నాడని తెలిసింది.

    బింబిసార చూసిన బాలయ్య.. వశిష్టను కథ రెడీ చేయమన్నాడు. రజనీకాంత్‌, బాలకృష్ణకు కథలు వినిపించి ఓకె చేయించుకున్నాడు. అయితే.. కమిటైన సినిమాలు పూర్తయిన తర్వాతే చేద్దామంటే.. గ్యాప్‌ రాకుండా.. చిరంజీవితో సినిమా ఓకె చేయించుకున్నాడు. భోళా శంకర్‌ తర్వాత మరో సినిమాకు కమిట్‌ కాని మెగాస్టార్‌.. వశిష్టకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్టే. అయితే.. బౌండెడ్‌ స్క్రిప్ట్‌ పూర్తయితేగానీ.. సినిమా మొదలుపెట్టడు చిరంజీవి. భోళాశంకర్‌ ఆగస్ట్ 11న రిలీజ్‌ అవుతోంది. ఈలెక్కన ఈ పాంటసీ మూవీ సెట్స్‌పైకి రావాలంటే.. ఇంకో ఆరేడు నెలలు పడుతుంది. చిరంజీవి కి తగిన డైరెక్టర్స్ లేక వెయిట్ చేయాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...