సమంత కు షాకిచ్చింది సిటీ సివిల్ కోర్టు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే …….. సమంత నటించిన యశోద చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో కొని సన్నివేశాలు తమ హాస్పిటల్ ను ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయని హైదరాబాద్ కు చెందిన ” ఇవా ” అనే హాస్పిటల్ యాజమాన్యం సిటీ సివిల్ కోర్టు కెక్కింది.
యశోద చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని , ఆ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడం వల్ల మా హాస్పిటల్ కు మరింత డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్పందించింది. డిసెంబర్ 19 లోపు యశోద చిత్రాన్ని ఓటీటీలోకి విడుదల చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.
దాంతో యశోద చిత్రం ఇప్పట్లో ఓటీటీలోకి రావడం కష్టమే అని తేలింది. రిలీజ్ కు ముందే ఓటీటీ తో ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాలతో సందిగ్దత నెలకొంది. దాంతో యశోద సినిమా ఓటీటీ లోకి రావడానికి మరికొంత సమయం పట్టేలా కనబడుతోంది. తెరవెనుక ఏదైనా వ్యవహారం సెట్ అయితే అప్పుడు తప్పకుండా షెడ్యూల్ కంటే ముందుగానే రావచ్చు.