మెగాస్టార్ చిరంజీవి పై దారుణమైన కామెంట్ చేసాడు ప్రముఖ రివ్యూ రైటర్ ఉమైర్ సంధు. మీ నుండి రొమాంటిక్ మూవీస్ ఆశించడం లేదు ….. బోరయ్యాం ….. సీరియస్ రోల్స్ ని మీనుండి ఆశిస్తున్నాం …… దయచేసి అలాంటి రోల్స్ చేయండి. వాల్తేరు వీరయ్య మరో డిజాస్టర్ అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు.
ఉమైర్ సంధు భారీ సినిమాలకు ముందుగానే రివ్యూ రేటింగ్ ఇస్తుంటాడు. అయితే ఉమైర్ బ్లాక్ బస్టర్ అంటే అది అట్టర్ ప్లాప్ అన్నమాటే ! ఇప్పటికి ఉమైర్ సంధు సూపర్ హిట్ అని చెప్పి మంచి రేటింగ్ ఇచ్చిన చిత్రాల్లో దాదాపుగా అన్నీ ప్లాప్ అయ్యాయి. కాకపోతే ఒకటి అరా మాత్రం హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. దాంతో ఉమైర్ డిజాస్టర్ అంటే వాల్తేరు వీరయ్య మంచి హిట్ అనే సెంటిమెంట్ నిజం అవుతుందేమో చూడాలి.
ఇక మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే వాళ్ళు కోట్లాదిమంది ఉంటారు. వాళ్ళు ఉమైర్ సంధు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం. ఉమైర్ సంధును ట్విట్టర్ లో టార్గెట్ చేయడం ఖాయం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ సినిమా పాటల చిత్రీకరణ కోసం ఫ్రాన్స్ వెళ్ళింది చిత్ర బృందం. అక్కడ చిత్రీకరించిన ఓ పాట లోని చిరంజీవి ,శృతి హాసన్ ల స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విమర్శలు చేసాడు ఉమైర్ సంధు. అయితే ఈ స్టిల్ లో చిరంజీవి చాలా యంగ్ గా ఉన్నాడు మరి.