హాట్ భామ అనసూయ తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ ఏంటో తెలుసా …… ” అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చోమో కానీ రావటం మాత్రం పక్కా ” అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ లో డైలాగ్ కొట్టేసింది.
గతంలో విజయ్ దేవరకొండ చేసిన కొన్ని డైలాగ్స్ అనసూయకు కోపం తెప్పించాయి. దానికి అప్పట్లోనే అనసూయ విజయ్ దేవరకొండపై విమర్శలు చేసింది. కట్ చేస్తే విజయ్ దేవరకొండ నిర్మించిన ” మీకు మాత్రమే చెప్తా ” లో కూడా నటించింది. ఇక అప్పట్లో జరిగిన గొడవ గురించి మాట్లాడితే లైట్ గా తీసుకున్నారు ఇద్దరు కూడా.
కట్ చేస్తే తాజాగా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. అయితే ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. అయితే ఈరోజు రిలీజ్ అయిన లైగర్ కు ప్లాప్ టాక్ వచ్చింది. దాంతో కాబోలు ఇలా ట్వీట్ చేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అనసూయ ట్వీట్ పై కొంతమంది అనుకూలంగా మాట్లాడుతుంటే మరికొంతమంది మాత్రం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
Breaking News