
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ” ఉస్తాద్ భగత్ సింగ్ ” . ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుండటం ఆలస్యం అవుతుండటంతో పెద్ద ఎత్తున పుకార్లు షికారు చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేస్తున్నారని అందుకే సినిమా ఆలస్యం అవుతోందని పుకార్లు వినిపిస్తున్నాయి. అలాగే కొంతమంది ఇలాగె ప్రచారం చేస్తున్నారు.
ఈ ప్రచారాలు దర్శకుడు హరీష్ శంకర్ దృష్టికి వెళ్లాయి. దాంతో ఆ గాలి వార్తలపై స్పందించాడు. నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉన్నాను . రాసేముందు నన్ను కాస్త అడగొచ్చు కదా ! అంటూ సదరు వ్యక్తిని నేరుగా ప్రశ్నించాడు హరీష్ శంకర్. అంతేగాదు ఉస్తాద్ భగత్ సింగ్ స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని , చేయలేదని కుండబద్దలు కొట్టాడు.
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రాజకీయ నేపథ్యంలో రూపొందే చిత్రంగా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అలాగే ఇదే సమయంలో జనసేన పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు.