షూటింగ్ లో గాయపడింది లేడీ డైరెక్టర్ సుధా కొంగర. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన సూరరై పొట్రు సంచలన విజయం సాధించడమే కాకుండా అవార్డులను ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. దాంతో ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ హిందీ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తుండగా హీరో సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో సుధా కొంగర గాయపడింది. దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు చిత్ర యూనిట్. చేయి విరగడంతో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. దాంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది సుధా కొంగర.