కార్మికులకు ఎట్టకేలకు శుభవార్త తెలిపింది ఫిల్మ్ ఛాంబర్. ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగ్ లు ఆగిపోవడంతో రోజు వారీగా పని చేసుకుని జీవనం సాగించే శ్రామికులకు ఇబ్బంది కలిగింది. అయితే గిల్డ్ లోని ప్రముఖ నిర్మాతలు 24 రోజుల పాటు సాగించిన చర్చల ఫలితంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలతో చిత్ర పరిశ్రమ సంక్షోభం నుండి బయట పడుతుందని భావిస్తున్నారు.
దాంతో ఇక సెప్టెంబర్1 నుండి సినిమా షూటింగ్ లు చేసుకోవచ్చని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. అయితే ఈలోపు షూటింగ్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటే ఛాంబర్ లో అనుమతి తీసుకొని షూటింగ్ లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. మళ్లీ షూటింగ్ లు స్టార్ట్ అవుతుండటంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ లతో కళకళలాడనుంది టాలీవుడ్.