
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 28 వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29 వ సినిమాను చేయనున్నాడు. ఇక ఈ సినిమా బడ్జెట్ నిన్న మొన్నటి వరకు ఒకలా ఉండే కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఎందుకో తెలుసా ……. రాజమౌళి ఆస్కార్ సాధించడమే !
ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ప్రభంజనం సృష్టించిన రాజమౌళి ….. ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ వస్తుందని నమ్మి గట్టి ప్రయత్నాలు చేసాడు. కట్ చేస్తే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు కొట్టేసింది. ఇంకేముంది రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇక ఇప్పుడు రాజమౌళి రేంజ్ పూర్తిగా మారిపోయింది.
అందుకే ఈ సినిమాకు ఏకంగా 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట. మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో టాలీవుడ్ , బాలీవుడ్ నటీనటులతో పాటుగా పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా నటించనున్నారని సమాచారం. అలాగే మహేష్ సరసన హీరోయిన్ గా హాలీవుడ్ భామను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. ఇలా బడ్జెట్ అమాంతం పెరిగి పోతోంది. దాంతో ఈ సినిమాకు 500 కోట్ల బడ్జెట్ అవుతోందని , ఈ మొత్తం దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.