సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ సమంత తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటో తెలుసా …… బాలీవుడ్ సినిమాల నుండి తప్పుకోవడమే ! సమంత మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మాయోసైటిస్ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో కొద్ది రోజులుగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది.
అయితే విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి చిత్రం మరో రెండు షెడ్యూల్స్ మాత్రమే బాకీ ఉండటంతో ఆ షూటింగ్ పూర్తి చేసి సినిమాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. అయితే అంతకుముందు బాలీవుడ్ లో అలాగే హాలీవుడ్ సినిమా కూడా ఒప్పుకుంది కాబట్టి ఆ సినిమాలు సెట్స్ మీదకు రాబోతున్నాయి. దాంతో డేట్స్ కేటాయించాలని బాలీవుడ్ నిర్మాతలు కోరారట.
ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో సినిమాలు చేయలేనని , కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని , చికిత్స పొందాలని అడిగిందట. అయితే మిగతా నటీనటులు , సాంకేతిక నిపుణుల డేట్స్ తీసుకున్నాం కాబట్టి వాయిదా వేయడం కుదరదు. మీకోసం వాయిదా వేయాల్సి వస్తే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని చెప్పారట. దాంతో చేసేదిలేక సమంత ఆ సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.