mahabaratham దర్శక ధీరుడు రాజమౌళి గురించి మనకు తెలిసిందే. అతడు సినిమా తీశాడంటే రికార్డులు కొల్లగొట్టాల్సిందే. దీంతో అతడి క్రేజీ అంతలా పెరిగిపోయింది. బాహుబళి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతి అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటునాటు పాట ఆస్కార్ సంపాదించింది. దీంతో రాజమౌళి సినిమా అంటే ఏ మేరకు దూసుకుపోతోంది తెలిసిపోయింది.
ఇప్పుడు మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని తెలిపారు. ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని సెలవిస్తున్నారు.
మహేష్ బాబు సినిమా తరువాత మహాభారతం తీస్తారని చెబుతున్నారు. కృష్ణుడుగా మహేష్ బాబు, అర్జునుడుగా రాంచరణ్, కర్ణుడిగా ప్రభాస్, భీముడిగా ఎన్టీఆర్, ధర్మరాజుగా పవన్ కల్యాణ్, దుర్యోధనుడుగా రాణా, భీష్ముడిగా రజనీకాంత్, ద్రోణాచార్యుడిగా అమితా బచ్చన్, ద్రౌపదిగా దీపికా పదుకొనే నటిస్తారని చెబుతున్నారు.త్వరలో దీనికి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయి.
మహాభారతం 8 భాగాలుగా పడుతుంది. దీని తరువాత రాజమౌళి సినిమాలకు టాటా చెప్పడం సహజమే. మహాభారతానికి సంబంధించిన క్యాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త లీక్ కావడంతో ఇప్పడు అందరు దీని గురించే చర్చించుకుంటున్నారు. రాజమౌళి సినిమా అంటే దాని స్టామినా ఏంటో అందరికి తెలుసు. అలా రాజమౌళి సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.