తెలుగు తెర ఇలవేల్పులు అయిన ఎన్టీఆర్ , అక్కినేని , ఎస్వీ రంగారావు , సావిత్రి , రేలంగి , గుమ్మడి వంటి మహామహులు కలిసి నటించిన అద్భుత దృశ్యకావ్యం ” మాయాబజార్ “. దిగ్గజ దర్శకులు కేవీ రెడ్డి అద్భుత మాయాజాలం ఈ మాయాబజార్. విజయా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ దృశ్యకావ్యం 1957 లో విడుదల అయ్యింది. అప్పట్లో ఈ సినిమా తెలుగునాట సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. విడుదలైన ప్రతీ చోటా రికార్డుల మోత మోగించింది.
ఘంటసాల అద్భుతమైన పాటలను ఆలపించి శ్రోతలను విశేషాంగా అలరించారు. ఇక సాలూరి రాజేశ్వర్ రావు అందించిన సంగీతం ప్రేక్షకులను ఓలలాడించింది. మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
అయితే మాయాబజార్ చిత్రాన్ని గోల్డెన్ స్టోన్స్ వాళ్ళు 2010 లో కలర్ లోకి మార్చారు. ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి మాయాబజార్ ను కలర్ లోకి మార్చి విడుదల చేశారు. ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే కొన్ని సన్నివేశాలను కలర్ లోకి మార్చలేకపోయారు. దాంతో ఇప్పుడు మిగతా సన్నివేశాలను కూడా కలర్ లోకి మార్చి , డిజిటల్ లోకి మార్చారు. ఇక డిసెంబర్ 9 న మళ్లీ మరొక్క సారి తెలుగు ప్రేక్షకులు ముందుకు రానుంది మాయాబజార్ చిత్రం. ఆబాలగోపాలాన్ని అలరించిన మాయాబజార్ ఈతారనికి కూడా అందుబాటులోకి రానుండటం విశేషం అనే చెప్పాలి.