రోజా నోరు మురికి కాలువ కంటే దారుణమని సంచలన వ్యాఖ్యలు చేసాడు మెగా బ్రదర్ నాగబాబు. పర్యాటక శాఖ అంటే నువ్వు పర్యటించడం కాదు…… రాష్ట్రానికి పర్యాటకులు ఎక్కువగా రావాలని , నువ్వు పర్యాటక శాఖ మంత్రి అయ్యాక పరిస్థితులు మరింత దారుణమయ్యాయని దాంతో పర్యటన రంగం కుదేలయిందని , ఇన్నాళ్లు మా అన్నదమ్ములను ఎన్ని తిట్టినా భరించామని కానీ ఇకపై విమర్శిస్తే సహించేది లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు నాగబాబు.
ఇటీవల మంత్రి రోజా మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు , పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడిన సంగతి తెలిసిందే. పిల్లికి కూడా బిచ్చం వేయలేదని, వాళ్ళు ఎవరినీ ఆదుకోలేదని అందుకే ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురు కూడా ఓడిపోయారని ఘాటుగా విమర్శించిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి , నాగబాబు , పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పోటీ చేశారు. అయితే ముగ్గురు కూడా ఓడిపోయారు. కాకపోతే 2009 లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరు రెండు చోట్ల పోటీ చేస్తే తిరుపతి లో మాత్రం గెలిపించారు. ఒక చోట ఓడిపోయాడు. దాంతో అప్పటి విషయాలను ఉదహరిస్తోంది రోజా. ఇంకేముంది రోజా మాటలు నాగబాబుకు చాలా కోపం తెప్పించాయి అందుకే రోజా నోరు మురికి కాలువ కంటే దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.