డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు జారీ చేసింది. ఈనెల 19 న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు ఇచ్చింది. గతంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులో హీరో రవితేజ , దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి , సుబ్బరాజు , తరుణ్ , నందు , తనీష్ తదితరులను విచారించింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ. అయితే ఎలాంటి ముగింపు లేకుండానే ఆ కేసు మరుగున పడింది. ప్రారంభంలో అయితే తీవ్ర సంచలనం సృష్టించింది.
మొదట్లో ఈ డ్రగ్స్ కేసులో హీరో రానా , హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు లేవు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగిన తర్వాత సీన్ మారిపోయింది. రానా , రకుల్ ప్రీత్ సింగ్ లకు అప్పట్లో నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. కట్ చేస్తే …… ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసు తెరమీదకు వచ్చింది. అయితే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేతిలోని దర్యాప్తు సంస్థ కాగా ఇప్పుడేమో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ విచారణ చేయనుంది. ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఈనెల 19 న రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందు విచారణకు హాజరు కానుంది. ఇక ఇదే డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ని కూడా ఈడీ నోటీసులు అందించింది. దాంతో ఈనెల 19 న పైలెట్ రోహిత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు.