మహా నటులు నందమూరి తారకరామారావు ధైర్యంగా చేసిన చిత్రం ” కలసి ఉంటే కలదు సుఖం”. తాపీ చాణక్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా మహానటి సావిత్రి కి కూడా మరిచిపోలేని చిత్రంగా నిలిచింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ అవిటి వాడిగా నటించారు. ఈ సినిమాలో ధైర్యంగా నటించారు కానీ ఆయన అభిమానులు , మిగతవాళ్ళు మాత్రం భయపడ్డారట. ఎందుకో తెలుసా…….. ఎన్టీఆర్ అప్పటికే తిరుగులేని మాస్ హీరోగా తెలుగునాట సంచలనం సృష్టించారు. మాస్ హీరోగా రాణిస్తున్న ఎన్టీఆర్ ని అవిటి వాడి పాత్రలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం అయితే ఉండేది. అయితే సినిమా విడుదల అయ్యాక మాత్రం ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టారు. దాంతో ఎన్టీఆర్ కెరీర్ లో క్లాసిక్ చిత్రంగా నిలిచింది కలిసి ఉంటే కలదు సుఖం.