పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హ్యాండ్ ఇచ్చింది పూజా హెగ్డే. పవన్ కళ్యాణ్ కు పూజ హెగ్డే హ్యాండ్ ఇవ్వడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రంలో మొదట పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసుకున్నారు దర్శకులు హరీష్ శంకర్. అయితే ఆ సినిమా ప్రకటనకు మాత్రమే పరిమితమైంది కానీ షూటింగ్ కు మాత్రం వెళ్ళలేదు.
ఇక ఇటీవల భవదీయుడు భగత్ సింగ్ కాస్త …….. ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు టైటిల్ ను. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది దర్శకుడు హరీష్ శంకర్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే హీరోయిన్ గా మాత్రం పూజా హెగ్డే ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే పూజా హెగ్డే పలు చిత్రాలను కమిట్ అయి ఉంది.
ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. దాంతో ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. మరో కారణం ఏంటంటే …… ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. దాంతో ఈ ప్రాజెక్ట్ నుండి పూజా తప్పుకుందని సమాచారం.