Home VENDITHERA TOLLYWOOD PRABHAS- KRISHNAMRAJU:కృష్ణంరాజుకు ప్రభాస్ తలకొరివి ఎందుకు పెట్టలేదో తెలుసా ?

PRABHAS- KRISHNAMRAJU:కృష్ణంరాజుకు ప్రభాస్ తలకొరివి ఎందుకు పెట్టలేదో తెలుసా ?

37
prabhas-krishnamraju-do-you-know-why-prabhas-did-not-put-a-torch-on-krishnamrajus-head

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు డార్లింగ్ ప్రభాస్ అంటే చాలా చాలా ఇష్టం. తనకు కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ ను తన వారసుడు అని ప్రకటించారు. అంతేకాదు సినిమాల్లోకి తీసుకొచ్చి చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. కట్ చేస్తే తన కష్టంతో ఈరోజు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే ప్రభాస్ ను తన వారసుడిగా ప్రకటించారు కాబట్టి అలాగే కృష్ణంరాజుకు కొడుకులు లేరు కాబట్టి తప్పకుండా ప్రభాస్ తలకొరివి పెడతాడనే అనుకున్నారు కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ప్రభాస్ కు బదులుగా ప్రభాస్ అన్న ప్రమోద్ కృష్ణంరాజుకు తలకొరివి పెట్టాడు. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా ……. ప్రభాస్ ఎందుకు తలకొరివి పెట్టలేదో తెలుసా ……. ప్రభాస్ కు ఉపనయనం కాకపోవడమే ! అవును. కృష్ణంరాజు కుటుంబం క్షత్రియ వంశానికి చెందినది కావడంతో తలకొరివి పెట్టాలంటే ఉపనయనం జరిగిన తర్వాత మాత్రమే ! అలాంటి వాళ్లకు మాత్రమే తలకొరివి పెట్టే అధికారం , అవకాశం ఉంటుంది. ప్రభాస్ కు ఉపనయనం కాలేదు కాబట్టి పెద్ద నాన్న కృష్ణంరాజుకు తలకొరివి పెట్టలేకపోయాడు.

కృష్ణంరాజు బ్రతికున్న కాలంలో ప్రభాస్ పెళ్లి చూడాలని ముచ్చట పడ్డారు. కానీ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు. దాంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు.