
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు ఈసారి చాలా ప్రత్యేకంగా మారింది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ సినిమా తర్వాత.. జరుపుకుంటున్న వేడుక కావడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు ఆయన వరుసబెట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ క్రమంలో ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. కొన్ని అరుదైన చిత్రాలను షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడంతో చిరు ఆనందానికి అవదుల్లేకుండాపోయాయి. కొడుకు బర్త్ డే రోజు మరోసారి తన తనయుడిపై ప్రేమ కురిపించాడు మెగాస్టార్. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న.. హ్యాపీ బర్త్ డే అంటూ తనయుడిని ముద్దాడుతున్న ఫోటోలను షేర్ చేయగా… నెట్టింట వైరల్ గా మారింది.
కామన్ గా మెగా బ్రదర్స్ మధ్య ప్రేమ ఎంతో బలంగా కనిపిస్తుంది. ఒకరంటే ఒకరు ఈ అన్నాదమ్ములు ప్రాణం తీసుకుంటారు. ఒకరి కోసం ఒకరు నిలబడుతుంటారు. అందులోనూ చిరంజీవికి తన తమ్ముడు పవన్ అంటే ఎంత ప్రేమో.. తన అన్నయ్య కొడుకు చరణ్ అంటే పవన్ కు అంత ప్రేమ.. ఈ విషయాన్ని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు పవన్. స్నేహభావంతో మెలిగే చరణ్ మరెన్నో విజయాలు అందుకొని ఎదగాలని, అందరి మన్ననలూ అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దైవ చింతన, ప్రశాంత చిత్తం కలిగిన చరణ్ కి ఉన్న క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత ఆయుధాల్లాంటివని కొనియాడారు. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.అంతేకాక రామ్ చరణ్ చిన్నతనంలో అంటే సుమారు ఆరు నెలల వయసున్నప్పటి ఈ ఫోటోను చూసి అంతా ఫిదా అవుతున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ చరణ్ కు అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు అత్యంత ప్రత్యేకంగా మారింది.ఈ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మెగా ప్రేమ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.