38.3 C
India
Thursday, May 2, 2024
More

    రానా నాయుడు రెడీ.. మాకొద్దు బాబోయ్!

    Date:

     

    Rana Naidu Season 2 Ready
    Rana Naidu Season 2 Ready

    రానా నాయుడు వెబ్ సిరీస్లో వెంకటేష్, రానా బోల్డ్‌నెస్ చూసి అంతా షాక్ అయ్యారు. అసలు వీళ్లు మన తెలుగు హీరోలేనా? అనే సందేహం రాక మానదు. సీజన్ వన్ స్టార్టింగ్ ఎపిసొడ్‌లు అయితే.. బ్లూ ఫిల్మ్‌లా ఉందనే టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఈ సిరీస్‌ను ఆపేయాలని అన్నారు. అయితే ఒక్కసారి వెబ్ సిరీస్‌కు కమిట్ అయితే.. హీరోలు ఏదైనా చేయాల్సిందే. అలా ఉంటుంది మరి ఓటిటి సంస్థల అగ్రిమెంట్స్. అందుకే రానా, వెంకీ ‘రానా నాయుడు’గా బోల్డ్ కంటెంట్‌ చేశారని చెప్పొచ్చు.

    అయితే ఫస్ట్ సీజన్‌తో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రానా నాయుడుకి.. ఇప్పుడు సెకండ్ సీజన్‌ రెడీ అవుతోంది. ప్రముఖ ఓటిటి దగ్గజం నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్‌న్ సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించారు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌కు డివైడ్ టాక్ వచ్చింది. దీంతో సెకండ్ సీజన్ ఉండే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ తగ్గేదేలే అంటున్నారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు సీజన్ 2 వస్తోంది.. అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

    తాజాగా రానా నాయుడు సీజన్ 2 కు సంబంధించిన ఓ టీజర్ వీడియోను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. దాంతో పాటు మరేం చింతించకండి.. మీ బాధనంతనంటినీ పోగొట్టడానికి నాయుడులు మళ్లీ తిరిగి వస్తున్నారు.. రానా నాయుడు సీజన్ 2 త్వరలోనే విడుదల కానుందంటూ నెట్ ఫ్లిక్స్ రాసుకొచ్చింది. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తి్స్తోన్న ఈ సీజన్ 2 గ్లింప్సెస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో ఈ సిరీస్‌ను రిలీజ్ చేయాలనుకుంటే అడల్ట్ కంటెంట్ తగ్గించాలని.. సీజన్‌ 1కి మించి ఇది ఉండాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాబోయ్ ఈ బోల్డ్ సిరీస్ మాకొద్దు.. అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈసారి రానా నాయుడు ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.

    ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ రే డోనోవన్ ఆధారంగా రూపొందించిన ‘రానా నాయుడు’ సిరీస్ మార్చి10న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విడుదలైన మూడు వారాల పాటు భారతదేశంలోనే అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌గా నంబర్.1 స్థానంగా నిలిచి ట్రెండ్ స-ృష్టించింది. వరుసగా ఐదవ వారంలోనూ దేశంలోని టాప్ 10 సిరీస్‌లలో ఒకటిగా రానా నాయుడు దూసుకుపోతోంది. విడుదలైన రెండు వారాల పాటు నాన్-ఇంగ్లీష్ టీవీ షోల కోసం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్ 10లో ‘రానా నాయుడు’ కూడా ట్రెండ్ అయ్యాడు.

    Share post:

    More like this
    Related

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Venkatesh : వెంకటేష్ ను అందుకే అభిమానులు ఇష్టపడుతుంటారు?

    Venkatesh : మన స్టార్ హీరోల తీరే సపరేట్ గా ఉంటుంది....

    Venky 75 : ‘నైజాం బాబులు’ పాటకు వెంకీ ‘మామ’ స్టెప్పులు..!

    Venky 75 : 'నైజాం బాబులు' సాంగ్కు వెంకీ మామ...

    Saindhav Trailer : సైంధవ్ ట్రైలర్ : పాప ప్రాణం కోసం ఎంతదాకా అయినా? వెంకీ విశ్వరూపం..

    Saindhav Trailer : విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రంగా ‘సైంధవ్’ సినిమా రూపొందింది....

    Venkatesh – Mahesh Babu Poker :  ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో పేకాట ఆడి దొరికిన వెంకటేశ్, మహేష్ బాబు.. వైరల్ ఫొటోలు

    Venkatesh and Mahesh Babu Poker : కాదెవరు వ్యసనాలకు అనర్హం అన్నట్టుగా...