అందాల భామ సమంత దెయ్యం పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అమర్ కౌశిక్ అనే దర్శకుడు హర్రర్ అనే చిత్రాన్ని రూపొందించడానికి భారీ సన్నాహాలు చేస్తున్నాడు. కాగా అతడు సమంతను కలిసి కథ చెప్పగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలు కావడంతో వెంటనే ఒప్పుకుందట. ఇక రెండు పాత్రల్లో ఒకటి దెయ్యం పాత్ర కాగా మరొకటి రాజ్ పుత్ రాణి పాత్ర దాంతో వెంటనే ఒప్పేసుకుందట.
ప్రస్తుతం ఈ సినిమా వర్క్ షాప్ జరుపుకుంటోంది. దాంతో సమంత అలాగే హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా పాల్గొంటున్నాడు. చిత్రీకరించబోయే సన్నివేశాలు ఎలా ఉండనున్నాయో చర్చిస్తున్నారు ప్రస్తుతం. దాంతో సమంత ముంబైలోనే ఉండిపోయింది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలగాలని చూస్తోంది సమంత. దాంతో ఈ సినిమాను అంగీకరించిందట.
తెలుగులో చేసిన శాకుంతలం , యశోద చిత్రాలు షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. శాకుంతలం చిత్రంలో ఎక్కువగా గ్రాఫిక్స్ ఉన్నాయి దాంతో ఆ సినిమా కాస్త ఆలస్యం అయ్యేలా కనబడుతోంది. ఇక యశోద చిత్రం దాదాపుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. దాంతో విడుదలకు సిద్దమైనట్లే !