అక్కినేని నాగచైతన్య – సమంత లు ఘాడంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పట్టుమని నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే విడాకులు తీసుకున్నారు. దాంతో అటు సమంత అభిమానులు ఇటు నాగచైతన్య అభిమానులు చాలా బాధపడ్డారు. ఈ ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు కదా ! ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే ప్రశ్నలు ఉదయించాయి.
అయితే వాటికి సమాధానం దొరకలేదు కానీ తాజాగా అందుకు కారణం ఏంటో తెలిసింది. ఇంతకీ సమంత – నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ……. నాగచైతన్య సమంతని కంట్రోల్ చేయాలని చూడటమేనట. వేసుకునే బట్టల్లో తప్పు వెతికేవాడట. అంతేకాదు గ్లామర్ పాత్రల్లో నటించొద్దని కండీషన్ పెట్టాడట. అలాగే సమంతకున్న ఫ్రెండ్స్ ని కంట్రోల్ చేయాలని చూశాడట.
ఇలా వరుసగా ఆంక్షలు పెడుతూ తనని కంట్రోల్ చేయాలని చూడటంతో తరచుగా గొడవలు అయ్యాయట. ఇలా రోజూ గొడవలు పడుతూ కలిసి ఉండేకంటే స్వేచ్ఛగా బ్రతకాలని నిర్ణయించుకుందట. అందుకే విడాకులు కావాలని మొదటగా సమంతనే అడిగిందట. అంతేకాదు విడాకులు ఇచ్చి స్వేచ్ఛగా బ్రతకాలని అనుకోవడమే కాదు విడాకులు తీసుకున్న వెంటనే ఐటెం సాంగ్ చేసి తన ఉద్దేశ్యం ఏంటో నాగచైతన్యకు చాటి చెప్పింది. విడాకుల ప్రకటన తర్వాత మరింత గ్లామర్ గా దర్శనం ఇస్తోంది సమంత. నన్ను ఎవరూ కంట్రోల్ చేయలేరు అని నినదిస్తోంది సమంత.