ఫిబ్రవరి 17 న విడుదల కావాల్సిన సమంత శాకుంతలం, విశ్వక్ సేన్ దమ్కీ చిత్రాలు వాయిదా పడ్డాయి. ఈ సినిమాలు వాయిదా పడనున్నాయని ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఈరోజు ప్రకటన విడుదల చేశారు. దాంతో ఈనెల 17 న సమంత శాకుంతలం , విశ్వక్ సేన్ దమ్కీ విడుదల కావడం లేదు.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం దమ్కీ. ఫలక్ నుమా దాస్ చిత్రానికి ఇది సీక్వెల్. ఫలక్ నుమా దాస్ మంచి విజయం సాధించడంతో ఈ సినిమా స్టార్ట్ చేసాడు. ఫిబ్రవరి 17 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేసాడు. అయితే ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉన్నందున వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన విడుదల చేశాడు విశ్వక్ సేన్.
ఇక సమంత శాకుంతలం ఇలా విడుదల వాయిదా పడటం ఇది రెండోసారి. గతంలోనే విడుదల కావాల్సి ఉండే అప్పుడు కొత్త రిలీజ్ డేట్ చెబుతామన్నారు. కట్ చేస్తే ఫిబ్రవరి 17 న విడుదల అని ప్రకటించారు. ఇంకేముంది విడుదలే అనుకున్నారు. కట్ చేస్తే మరోసారి సాంకేతిక కారణాల సాకుగా చూపిస్తూ విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త డేట్ కూడా ప్రకటించలేదు….. త్వరలోనే చెబుతామంటున్నారు.