డబ్బు కోసం ముసలి హీరోలతో నటిస్తావా ? అంటూ శృతి హాసన్ పై అదేపనిగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. నీ వయసు కంటే రెట్టింపు వయసు ఉన్న హీరోలు , తండ్రి లాంటి హీరోలతో రొమాన్స్ చేస్తావా ? అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే మొదట్లో ఈ ట్రోలింగ్ పట్ల పెద్దగా స్పందించలేదు కానీ మరీ దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో ఎట్టకేలకు స్పందించింది శృతి హాసన్.
నేను నటిగా సత్తా చాటడానికి ఎలాంటి పాత్రలనైనా చేయాల్సి ఉంటుంది. ఇక మరణించేవరకు రకరకాల పాత్రలను పోషించాల్సిందే. ఇలాంటి పాత్రలు ఛాలెంజింగ్ అనే చెప్పాలి. అయినా తండ్రి సమాన వయసున్న హీరోలతో నటించిన హీరోయిన్ లు గతంలో చాలామంది ఉన్నారు …… నేనే మొదటి దాన్ని కాదు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది నెటిజన్లకు.
శృతి హాసన్ ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఒకటి మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య చిత్రంలో అలాగే నందమూరి బాలకృష్ణ సరసన వీర సింహా రెడ్డి చిత్రంలో. ఇక ఈ రెండు చిత్రాలు కూడా జనవరి 12 న ఒకటి 13 న మరొకటి విడుదల అవుతున్నాయి. చిరంజీవి , బాలకృష్ణ లు 60 ప్లస్ లో ఉన్నారు శృతి హాసన్ కు 36 సంవత్సరాలు అంటే దాదాపు డబుల్ అన్నమాట. దాంతో తండ్రి వయసు ఉన్న వాళ్లతో రొమాన్స్ చేస్తావా ? అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.